Thursday, April 25, 2013

Class Updates Section - I - Apr 21st 2013



పునశ్చరణ (Revision): ప్రార్థనతో ప్రారంభించాము. ఇంతవరకు నేర్చుకున్న హల్లులను (య - వర్గము వరకు) చూడకుండా వ్రాయించాము. 60% మంధి సరిగ్గా వ్రాశారు. 
అక్షరములు (Letters): శ మరియు ష  అక్షరములు  ఎలా వ్రాయాలో నేర్పించాము.

పదములు (Words): య  - వర్గము మరియు శ, ష అక్షరములతో పదములు చెప్పించలేదు. పిల్లల తల్లిదండ్రులు ఈ పదములు వారికి చెప్పవలసినదిగా మనవి. 

య - యముడు, యువకుడు, యతి 
ర - రవి, రాజు, రాణి, రైలు, రంగు 
ల - లత, లంచం, లడ్డు, లవంగం 
వ - వల, వంకాయ, వదిన, వాన, వారం, వెన్నెల 
శ - శంఖం, శక్తి, శివ 
ష  - షష్టి  

అంకెలు (Numbers): చెప్పించలేదు.

మాట్లాడటం (Speaking): పిల్లలను  వారి వారి అనుమానాలను, ఆంగ్లములో అడగకుండా తెలుగులోనే అడిగేటట్లు ప్రోత్సహించాము. 

పద్యము/పాట (Poem/Song): లేదు. 

ఇతరములు(Others):  - ట వర్గము తర్వాత వచ్చే హల్లులు వ్రాయటానికి పిల్లలు ఇబ్బంది పడుతుండటం చూసిన తర్వాత వారిచేత ఇంత వరకు నేర్చుకున్న హల్లులన్నీ  పలుమార్లు వారి వారి 
నోట్ పుస్తకములలో ఒక గంట సేపు సమయాన్ని వెచ్చించి అభ్యాసము చేయించాము. 

అచ్చులు, హల్లులు కలసి వున్న కొన్ని పదాలను బోర్డు మీద వ్రాసి పిల్లలచేత చదివించాము (ఉదా: అర, అల, కల, వల, ఆట, ఈగ, ఊయల, ఊడ,  ఎర, కమల, పలక.... )

అభ్యాసము (Home Work): విద్యార్థులు ఇంతవరకు నేర్చుకున్న 'అచ్చులు' మరియు 'హల్లులు - య  - వర్గము వరకు' ఇదు  పుటలు వారి నోట్ పుస్తకములలో వ్రాయాలి.  ఎవరైతే అన్ని అచ్చులు మరియు హల్లులు  య - వర్గము వరకు, 5 పుటలు వ్రాస్తారో, వారిని మాత్రమే బహుమతులను తీసుకోవడానికి అర్హులుగా నిర్ణయిస్తాము.  అంకెలు 1 - 100 వరకు తప్పులు లేకుండా చెప్పగలగాలి. 

గత రెండు వారాలుగా తెలుగుబడి క్లాసులకు రాని పిల్లలందరూ త, ప, య వర్గము మరియు శ, ష  వరకు హల్లులు నేర్చుకొని రావలసినదిగా మనవి. 

'వినదగు నెవ్వరు చెప్పిన' పద్యము  కొరకు దిగువన వున్న యు - ట్యూబ్ లింకును క్లిక్ చేసి పిల్లలకు చూపించి, నేర్పించవలసినదిగా తల్లిదండ్రులకు మనవి. 

No comments:

Post a Comment