ప్రతి తెలుగు వారి పెరటిలో వుండవలసిన చెట్టు అరటి చెట్టు. అన్ని శుభ కార్యాలలో అరటి, కొబ్బరి తప్పని సరిగా వుంటాయి. అరటి ఆకులో భోజనం చేయడం ప్రశస్తం. అరటి పండ్లు పూజలలో నైవేద్యానికి వాడతారు. తింటే ఆరోగ్యానికి మంచిది. అరటి పువ్వుతో, కాయతో, దవ్వతో కూరలు చేసుకోవచ్చును. అన్ని విధాల అరటి శ్రేష్టమైనది. అరటి చెట్టు చాల త్వరగా పెరుగుతుంది. ఇప్పుడు అరటి చెట్టు ఎలా పెరుగుతుందో, ఏడు వారాల పేర్లతో ఈ పాట నేర్చుకుందాం.
We thank ADITYA for up loading the video on You Tube.
అరటి పాట | |
ఆదివారం నాడు అరటి మొలచినది | |
సోమవారం నాడు సుడి వేసి పెరిగినది | |
మంగళవారం నాడు మారాకు తొడిగినది | |
బుధవారం నాడు పొట్టి గెల వేసినది | |
గురువారం నాడు గుబురులో దాగినది | |
శుక్రవారం నాడు దాగినది పండినది | |
శనివారం నాడు చకచకా గెల కోసి | |
అందరికి పంచితిమి అరటి అత్తములు | |
అబ్బాయి అమ్మాయి అరటి పండ్లివిగో | |
అబ్బాయి అమ్మాయి అరటి పండ్లివిగో | |
aadi vaaram naaDu araTi molichinadi
sOma vaaram naaDu suDi vEsi periginadi
mangaLa vaaram naaDu maaraaku toDiginadi
budha vaaram naaDu poTTi gela vEsinadi
guru vaaraM naaDu guburulO daaginadi
Sukra vaaram naaDu daaginadi panDinadi
Sani vaaram naaDu chaka chakaa gela kOsi
andariki panchitimi araTi attamulu
abbaayi ammaayi araTi panDlivigO
abbaayi ammaayi araTi panDlivigO
No comments:
Post a Comment