- ఉప్పు కప్పురంబు
అర్ధములు:
పోలిక = ఒకేలాగ వుండతం. ఉదాహరణకు పిల్లలు తల్లి తండ్రులను
పోలి వుంటారు. జాడ = ఉనికి; చిరునామా; జాడ వేరు అంటే ఒక్కొక్క రుచి ఒకోలా
వుంటుంది, ఏ రెండు రుచులు ఒకేలా వుండవు అని అర్ధం. పురుషులు = ఇక్కడ మనుషులని
అర్ధం, మగవారని కాదు. పుణ్య = గొప్ప, మంచి.
తాత్పర్యం:
ఉప్పు (salt), కర్పూరము (camphor) చూడటానికి ఒకేలాగ, అంటే తెల్లగా వుంటాయి. కాని రెండిటినీ రుచి చూస్తే మనకు తేడా తెలుస్తుంది. ఎలా అంటే, ఉప్పు ఉప్పగా వుంటుంది. కర్పూరం ఘాటుగా
వుంటుంది. అలాగే మనుషులు (పురుషులు) అందరూ చూడటానికి ఒకే విధంగా వుంటారు. కానీ కొంచెం పరిచయమయ్యాక వారు మంచివారో లేక చెడ్డ వారో చెప్పగలము. ఎందుకంటే గొప్పవారి (పుణ్య పురుషుల) లక్షణములు మామూలు మనుషుల కన్న భిన్నంగా అంటే వేరే విధంగా ఉంటాయి.
నీతి: మనుషులందరూ చూడటానికి ఒకే విధంగా ఉన్నప్పటికీ వారి గుణమును బట్టి వారు యెలాటి వారో నిర్ణయించాలి, రూపాన్ని బట్టి కాదు. మంచి వారెవరో తెలుసుకుని అలాంటి వారితోనే స్నేహం చేయాలి.
No comments:
Post a Comment